Robert Vadra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లు పంపారు. అయితే, ఈ కేసులో ఏప్రిల్ 8న మొదటిసారి జారీ చేసిన సమన్లును వాద్రా దాటవేయడంతో.. ఇప్పుడు రెండోసారి జారీ చేశారు.
వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అనంతరం ఈ భూమిని వాద్రా కంపెనీ రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో విచారణకు రావాల్సిందిగా వాద్రాను ఈడీ ఆదేశించింది.
Also Read..
Bengaluru | అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టిన వాటర్ ట్యాంకర్.. షాకింగ్ వీడియో
Golconda Blue Diamond | తొలిసారి వేలానికి గోల్కొండ నీలి వజ్రం.. రూ.430 కోట్ల వరకు ధర పలుకుతుందట!
Uttar Pradesh | దొంగతనం కేసులో నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు!.. యూపీలో ఓ ఎస్ఐ నిర్వాకం