Bengaluru | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి (Tanker loses control) రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బెంగళూరు శివారులోని దొమ్మసంద్ర (Dommasandra) వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వాటర్ ట్యాంకర్ దొమ్మసంద్ర నుంచి వర్తూర్ (Varthur) వైపు వెళ్తోంది. ఆ సమయంలో వాహనం అతివేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై రెండు మూడు పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ట్యాంకర్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ముందు వెళ్తున్న ఓ వాహనం డ్యాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
A #Speeding water tanker overturned, when the driver lost control of the vehicle, while overtaking a lorry, horrific accident captured on the #DashCamera of a nearby car.
The #RoadAccident occurred within the #Whitefield Traffic Police limits on Monday, leaving two… pic.twitter.com/dLevXSm2Ap
— Surya Reddy (@jsuryareddy) April 15, 2025
Also Read..
Golconda Blue Diamond | తొలిసారి వేలానికి గోల్కొండ నీలి వజ్రం.. రూ.430 కోట్ల వరకు ధర పలుకుతుందట!
Uttar Pradesh | దొంగతనం కేసులో నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు!.. యూపీలో ఓ ఎస్ఐ నిర్వాకం
NCERT | ఆంగ్ల పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు.. ఆ సంప్రదాయాన్ని ఉల్లంఘించిన ఎన్సీఈఆర్టీ