Rahul gandhi | వాటి ఆటలు నా దగ్గర సాగవని మోదీకి తెలుసు : రాహుల్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి తన దగ్గర వర్కవుట్ కాదని తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. నేను మాట విననని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏమిటో మీకు తెలుసా? అంటే.. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం రాహుల్ దగ్గర పనికిరాదన్నది దీని అర్థం. ఎంతకూ వినరని తెలుసు. అసలు నేనెందుకు వారి మాటలు వినాలి? అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
పేదలకు దేశంలో జాగా లేదు : రాహుల్
దేశంలో పేద వారికి చోటు లేకుండా పోయిందని రాహుల్ విమర్శించారు. చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించినా… మోదీ ఏమీ చేయట్లేని దెప్పి పొడిచారు. మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశాన్ని నాశనం చేశారని, ఈ సమయంలో ఏ కోటీశ్వరుడైనా లైన్లో నిల్చున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. మోద సర్కార్ జీఎస్టీని అమలుచేసి, సర్వనాశనం చేశారని, దీని ద్వారా యువకులు ఉద్యోగ ఉపాధిని కోల్పోయారని మడిపడ్డారు. తమ హయాంలో 4 లక్షల మందికి ఉపాధి ఇచ్చామని, న్యాయ్ పథకం కింద పేదలకు సహాయం కూడా చేశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఓ జాతీయ ఛానెల్‌కు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని తూర్పురా బట్టారు. సభకు హాజరనికాని వారికి సమాధానం ఇవ్వలేనని తేల్చి చెప్పారు. రాహుల్ ప్రస్తావించిన అంశాల గురించి మోదీని అడగ్గా… సత్యాల ఆధారంగా తాను ప్రతిదానిపై వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు కొన్ని విషయాలపై చాలా వివరణాత్మకమైన జవాబులు ఇస్తాయని, అప్పుడప్పుడు తాను కూడా సమాధానమిస్తానని మోదీ పేర్కొన్నారు. పార్లమెంట్‌కు హాజరుకాని వారికి, వినని వారికి నేనెలా సమాధానం చెప్పగలను? అంటూ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

