హైదరాబాద్, మార్చి 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి వినియోగిస్తున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. 2004-14 మధ్య దేశవ్యాప్తంగా ఈడీ 112 చోట్ల సోదాలు నిర్వహించగా.. 2014-22 మధ్య 2,974 (2,655 శాతం పెరుగుదల) చోట్ల దాడులు జరిపింది.
యూపీయేతో పోలిస్తే, బీజేపీ పాలనలో ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులు 2,700 శాతం పెరిగాయి. నమోదు చేసిన మొత్తం కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులపైనే ఫైల్ అయ్యాయి. దీంతో విపక్ష నేతలను దారికి తెచ్చుకోవడంలో భాగంగా కేంద్రం ఈ దాడులకు పాల్పడుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
