SIR | బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రాజకీయంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘సర్’కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్ఐఆర్ పేరుతో బీహార్లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించాయి. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది.
అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడడమే సర్ ప్రాథమిక లక్ష్యమని ఈసీ పేర్కొంటున్నది. అంతేకాదు, దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టనున్నట్లు ఇటీవలే ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే తమిళనాడు (Tamil Nadu)లోనూ ‘సర్’ నిర్వహించనున్నట్లు ఈసీ తాజాగా తెలిపింది. ఒక వారం రోజుల్లో రాష్ట్రంలో ఇది ప్రారంభం అవుతుందని శుక్రవారం మద్రాస్ హైకోర్టుకు (Madras High Court) తెలిపింది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిహార్లో సర్ ప్రక్రియ పూర్తయ్యింది. 7.472 కోట్ల పేర్లతో తుది జాబితాను సెప్టెంబర్ 30న ఈసీ ప్రచురించింది. అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణను ప్రారంభించే పని జరుగుతోందని.. ప్రారంభంపై తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవలే తెలిపారు.
Also Read..
Suicide Attacks | ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
Afghanistan: భారత్ తరహాలో ఆఫ్ఘనిస్తాన్ చర్యలు.. కాబుల్ నదిపై డ్యామ్ల నిర్మాణం