Suicide Attacks | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నగరంలో ఆత్మాహుతి దాడులకు (Suicide Attacks) కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో ఢిల్లీలోని సాదిక్‌నగర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం (స్పెషల్ సెల్) సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో ఆత్మాహుతి దాడుల కోసం శిక్షణ పొందుతున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్ కాగా.. మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నిందితులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. విచారణ సందర్భంగా ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు వారు అంగీకరించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Artificial Rain | ఈ నెల 29న ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. ఎందుకంటే..?
Air Pollution | కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. క్లౌడ్ సీడింగ్‌కు ఏర్పాట్లు
Kurmool Bus Accident | కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుపై 16 చలాన్లు