న్యూఢిల్లీ, జూన్ 20: జూన్ 4న ఎన్నికల ఫలితాల్ని వెలువరించిన ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 6 రాష్ర్టాల్లోని 8 లోక్‌సభ స్థానాల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన వారు సహా పలువురు అభ్యర్థులు వెరిఫికేషన్‌పై దరఖాస్తు చేశారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 3 స్థానాల్లోని 26 పోలింగ్ కేంద్రాల్లో వాడిన ఈవీఎంలపై వెరిఫికేషన్‌కు దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులు వెరిఫికేషన్ కోరాలంటే ఒక్కో ఈవీఎం సెట్‌కు రూ.47,200 ఎన్నికల కమిషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.