Earthquake | మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్‌కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ధార్, బర్వానీ, అలీరాజ్‌పూర్‌లో ప్రకంపనలు వచ్చాయి. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి నష్టం జరుగలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూకంపంతో ఇంట్లోని వస్తువులు ఊగిపోవడంతో ఇండ్లలోని ఉన్న వారంతా భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు.
చివరకు ఎలాంటి నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గతేడాది నవంబర్లోనూ ఇండోర్‌లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైంది. ఇదిలా ఉండగా.. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. తవాంగ్‌లో భూకంపం సంభవించగా.. భూకంప కేంద్రాన్ని భూటాన్‌కు సరిహద్దులో పశ్చిమ కమెంగ్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో గుర్తించారు.