Earthquake | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మరోవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోనూ భూమి కంపించింది. ఉఖ్రుల్లో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 2.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
Also Read..
Burj Khalifa | బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు.. అద్భుత దృష్యాన్ని పంచుకున్న దుబాయ్ యువరాజు
Jammu Kashmir | చలి గుప్పిట్లో అందాల కశ్మీర్.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Air Pollution | తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 150 విమానాలు రద్దు