Earthquake : రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని ఝున్ఝును (Jhunjhunu) పట్టణంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) మీడియాకు వెల్లడించింది.
ఎన్సీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. కాగా శనివారం మధ్యప్రదేశ్లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. బేతుల్ పట్టణంలో వచ్చిన ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8 గా నమోదైంది.