Nepal Earthquake | నేపాల్‌ను మళ్లీ వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Nepal Earthquake | పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు (Nepal Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది.
Nepal Earthquake | పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు (Nepal Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology ) వెల్లడించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu)కు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఈ నెల తొలి వారంలో కూడా నేపాల్‌ను వరుస భూకంపాలు గడగడలాడించాయి. కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా పలుసార్లు స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కూడా అక్కడ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.
Also Read..
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

