Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Alaska Airlines | డ్యూటీ నుంచి దిగిపోయి అదే విమానంలో ప్రయాణించిన ఓ పైలట్ చేసిన పనికి ప్రయాణికులు, విమాన సిబ్బంది గుండె ఆగినంత పనైపోయింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించి (tries to shut down engines) సదరు ఆఫ్-డ్యూటీ పైలట్ (Off duty pilot) కటకటాలపాలయ్యాడు.
Alaska Airlines | డ్యూటీ నుంచి దిగిపోయి అదే విమానంలో ప్రయాణించిన ఓ పైలట్ చేసిన పనికి ప్రయాణికులు, విమాన సిబ్బంది గుండె ఆగినంత పనైపోయింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించి (tries to shut down engines) సదరు ఆఫ్-డ్యూటీ పైలట్ (Off duty pilot) కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటు చేసుకుంది.
80 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్ (Alaska Airlines)కు చెందిన విమానం ఆదివారం వాషింగ్టన్ డీసీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ( San Francisco) కు బయలుదేరింది. అదే విమానంలో డ్యూటీ నుంచి దిగిపోయిన ఓ పైలట్ కాక్‌పిట్ వద్ద ఉండే జంప్ సీట్లో కూర్చున్నాడు. విమానం గాల్లో దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్లను ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే పై అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం విమానాన్ని ఒరెగాన్లోని పోర్ట్లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన ఆఫ్-డ్యూటీ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read..
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
Hamas | మరో ఇద్దరు బందీలను విడుదల చేసిన హమాస్
Mexico | పోలీసు కాన్వాయ్‌పై బుల్లెట్ల వర్షం.. 13 మంది మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

