Mexico | మెక్సికో : మెక్సికోలో సోమవారం దారుణం జరిగింది. పోలీసు కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. పోలీసులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 13 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ కాల్పుల ఘటన మెక్సికోలోని గురెరో రాష్ట్రంలోని కోయుక డి బెనిటెజ్ నగరంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
జాతీయ భద్రతా విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల్లో సీనియర్ అధికారి మృతి చెందాడా..? లేదా..? అనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.