Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా (Worlds Oldest Dog ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ( Guinness World Record) సాధించిన శునకం ‘బోబీ’ (Bobi) ఇక లేదు. 31 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ శునకం తాజాగా మరణించింది.
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా (Worlds Oldest Dog ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ( Guinness World Record) సాధించిన శునకం ‘బోబీ’ (Bobi) ఇక లేదు. 31 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ శునకం తాజాగా మరణించింది. రఫీరో డో అలెంటెజో బ్రీడ్‌కు చెందిన ఈ శునకం శనివారం పోర్చుగల్‌లో తాను నివాసముంటున్న ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని బోబీని అనేకసార్లు పరీక్షించిన వైద్యుడు డాక్టర్ కరెన్ బెకర్ వెల్లడించారు. ‘ఈ స్వీట్ బాయ్ శనివారం రాత్రి నింగికి ఎగిశాడు’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
11 మే 1992లో బోబీ జన్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక కాలం జీవించిన శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్తింపు పొందింది. మరో విశేషం ఏంటంటే.. బోబీ తన జీవితకాలమంతా ఒకే కుటుంబంతో గడపడమే. కాగా, బోబీ కంటే ముందు 1939లో ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్లాయ్’ అనే శునకం 29 సంవత్సరాల 5 నెలల వయసులో మరణించింది. అప్పటివరకు అదే అతిపెద్ద వయసున్న శునకంగా గుర్తింపు పొందింది. ఆ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ‘బోబీ’ అధిగమించింది.
Also Read..
VK Pandian | రాజకీయాల్లోకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయివేటు సెక్రటరీ..!
Hamas | మరో ఇద్దరు బందీలను విడుదల చేసిన హమాస్
Cyclone | బంగాళాఖాతంలో తుపానుగా మారిన అల్పపీడనం.. హమూన్‌గా పేరు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

