Cyclone | బంగాళాఖాతంలో తుపానుగా మారిన అల్పపీడనం.. హమూన్‌గా పేరు
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Cyclone | భువనేశ్వర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే హమూన్ తుపాను కారణంగా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ పేర్కొంది. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండనప్పటికీ, జాలర్లు ఎవరూ బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికార యంత్రాంగం సూచించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

