Elon Musk | ఆ పేరు పెట్టుకుంటే బిలియన్ డాలర్లు ఇస్తా.. వికీపీడియాకు మస్క్ బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై
Elon Musk | వికీపీడియాకు టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘వికీపీడియా’ పేరును ‘డికీపీడియా’ (Dikipedia)గా మార్చాలని సూచించారు. అలా చేస్తే బిలియన్ డాలర్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారు.
Elon Musk | అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (ఎక్స్)ను కొనుగోలు చేసినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టడంతోపాటు.. కృత్రిమ మేధ (AI) విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం దగ్గరి నుంచి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌ను విమర్శించడం వరకు దూకుడుతనంతో వ్యవహరించి.. నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచారు. అయితే, మస్క్ తాజాగా వికీపీడియా (Wikipedia)ను టార్గెట్ చేశారు. ఈ మేరకు వికీపీడియాకు తాను సూచించిన పేరు పెడితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇంటర్నెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సైట్స్‌లో వికీపీడియా ముందు వరుసలో ఉంటుంది. ఏ విషయం, ఏ వ్యక్తి గురించి అయినా ఉచితంగా సమాచారం పొందాలంటే వెంటనే వికీపీడియానే అనుసరిస్తాం. అయితే, కొద్ది కాలంగా వికీపీడియా ఓపెన్ చేయగానే విరాళాలకు సంబంధించిన సందేశం కనిపిస్తోంది. దీనిపై మస్క్ తాజాగా స్పందించారు. ‘వికీపీడియా’ పేరును ‘డికీపీడియా’ (Dikipedia)గా మార్చాలని సూచించారు. అలా చేస్తే బిలియన్ డాలర్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారు.
వికీపీడియా ఓపెన్ చేయగానే ‘వికీపీడియా అమ్మకానికి లేదు, జిమ్మీ వేల్స్ నుండి వ్యక్తిగత విజ్ఞప్తి’ అన్న సందేశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మస్క్ షేర్ చేస్తూ.. ‘వికీపీడియా పేరును డికీపీడియాగా మారిస్తే.. వారికి నేను బిలియన్ డాలర్లు ఇస్తాను. అయినా వికీపీడియా ఎందుకు డబ్బులు అడుగుతోంది..? వికీపీడియా ఫౌండేషన్‌కు అంత డబ్బు అవసరం ఏముంది..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? వికీ నిర్వహణకు అంతడబ్బు అవసరం లేదు. దేనికోసం డబ్బు అడుగుతున్నారు..?’ అంటూ మస్క్ ప్రశ్నించారు.
మస్క్ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ‘డబ్బు అందిన వెంటనే తిరిగి పేరు మార్చుకోవచ్చు కదా..?’ అని వికీపీడియా సైట్‌కు సలహా ఇచ్చారు. ఆ నెటిజన్ కామెంట్‌కు మస్క్ వెంటనే స్పందించారు. ‘నేనేమైనా ఫూల్ నా.. నేను సూచించిన పేరు కనీసం ఏడాది పాటు అలాగే ఉండాలి’ అంటూ కండిషన్ పెట్టాడు.
I will give them a billion dollars if they change their name to Dickipedia https://t.co/wxoHQdRICy
— Elon Musk (@elonmusk) October 22, 2023
Also Read..
Alaska Airlines | విమానం గాల్లో ఉండగా.. ఇంజిన్లు ఆఫ్ చేసేందుకు యత్నించిన పైలట్
Worlds Oldest Dog | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం మృతి
VK Pandian | రాజకీయాల్లోకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయివేటు సెక్రటరీ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

