న్యూఢిల్లీ: శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని(Air India Flight) మంగోలియా రాజధాని ఉలన్‌బాటర్‌కు దారి మళ్లించారు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విమానంలో గాలిలో ఎగురుతున్న సమయంలో సాంకేతిక లోపం ఏర్పినట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ ఏఐ174 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్ ముందస్తు జాగ్రత్తగా ఉలన్‌బాటర్‌లో సురక్షితంగా దిగినట్లు ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొన్నది. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి విమానానం 2.47 నిమిషాలకు బయలుదేరింది. ఆ విమానంలో సోమవారం రాత్రి 9.59 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉన్నది.
IMPORTANT UPDATE
“AI174 of 02 November, operating from San Francisco to Delhi via Kolkata, made a precautionary landing at Ulaanbaatar, Mongolia, after the flight crew suspected a technical issue en route. The aircraft landed safely at Ulaanbaatar and is undergoing the necessary…
— Air India (@airindia) November 3, 2025
సాంకేతిక సమస్య వచ్చిన ఆ విమానాన్ని పరిశీలించేందుకు ఇంజినీర్లు రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఉలన్‌బాటర్ విమానాశ్రయంలో ప్రయాణికులకు సహకారం అందిస్తున్నామని, వారికి తగిన భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.