Drunk passenger | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి (Drunk passenger) వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో ఎయిర్హోస్టెస్ (air hostess)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీ -శిర్డీ విమానంలో (Delhi – Shirdi flight) శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శిర్డీకి బయల్దేరింది. అయితే, అందులోని ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని క్రూ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లింది. విమానం టాయిలెట్ వద్ద సదరు ప్రయాణికుడు తనను అసభ్యకరంగా తాకినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో విమానం శిర్డీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు మద్యం తాగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు.
Also Read..
Chikungunya | మహారాష్ట్రలో చికున్ గున్యా విజృంభణ.. గతేడాదితో పోలిస్తే 39 శాతం పెరుగుదల
Pakistan violates ceasefire | వరుసగా 11వ రోజు.. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు