Chikungunya | మహారాష్ట్ర (Maharashtra)లో చికున్ గున్యా (Chikungunya) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ (Malaria, Dengue) వ్యాధులు చాలా వరకూ నియంత్రణలో ఉన్నప్పటికీ.. చికున్ గున్యా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చికున్ గున్యా కేసుల నివారణకు చర్యలు చేపడుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ (NCVBDC) సమాచారం ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ 39 శాతం మేర చికున్ గున్యా కేసులు పెరిగాయి. 2024లో 473గా ఉన్న చికున్‌గున్యా కేసులు ఈ ఏడాది ఏప్రిల్ 21 వరకూ 658కి పెరిగాయి. అదే సమయంలో రాష్ట్రంలో మలేరియా కేసులు గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 2024లో 2,867గా మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 2,726కి తగ్గాయి. డెంగ్యూ ఇన్ఫెక్షన్లు సైతం 1,639 నుంచి 1,373కి తగ్గాయి. అయితే, ఊరట కలిగించే విషయం ఏంటంటే.. 2025లో ఇప్పటి వరకూ డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, జికా వంటి వ్యాధుల కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. వ్యాధులను ముందస్తుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం వల్లే మరణాలు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read..
Nuclear Attack: నీళ్లను ఆపితే అణ్వాయుధ దాడి చేస్తాం: వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్
Nishikant Dubey | నిషికాంత్ దూబేపై కోర్టు ధిక్కారం పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు