హైదరాబాద్, జూన్ 9 (నమస్తేతెలంగాణ) : దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన అంశంపై అధ్యయనం చేస్తున్న జస్టిస్ కేఎన్ బాలకృష్ణన్ కమిషన్ పదవీకాలం గడువును మరో ఏడాదిపాటు పొడిగించాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి దళిత ముస్లింలు, దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై విచారణ జరుపాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించినదని తెలిపారు. తెలంగాణలో కూడా కమిషన్ పర్యటించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అందువల్ల కమిషన్ గడువును పొడిగించి దేశవ్యాప్తంగా విసృ్తత పర్యటనలు నిర్వహించి లోతైన అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.