IndiGo | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల (passengers) ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు తప్పతాగి వికృతచేష్టలకు పాల్పడుతుంటారు. మరికొందరు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇండిగో (IndiGo) విమానంలో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో మతపరమైన నినాదాలు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు.
ఈనెల 1వ తేదీన (సోమవారం) ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఇండిగో విమానం 6E6571లో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో గందరగోళం సృష్టించాడు. 31డీ సీటులో కూర్చున్న ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగా ‘హర హర మహాదేవ’ నినాదాలతో హోరెత్తించాడు. క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు (Misbehaves With Crew). అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది అతడిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే సదరు ప్రయాణికుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అతడు ఓ లాయర్ (Drunk Lawyer)గా అధికారులు గుర్తించారు.
Also Read..
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు
Digital Fraud | పహల్గాం దాడి పేరుతో వృద్ధురాలిని బెదిరించి.. రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు