ChatGPT | ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌బాట్ (AI chatbot) చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో అంతరాయం ఏర్పడింది (ChatGPT down). ఫలితంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. AI చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.
డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య తలెత్తింది. భారత్ నుంచే దాదాపు 500కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఏదైనా ప్రశ్నలు వేయగా దాన్ని స్వీకరించేందుకు చాట్ జీపీటీ నిరాకరిస్తోందని, ప్రశ్న తీసుకున్నా స్పందించడం లేదని యూజర్లు పేర్కొంటున్నారు. అంతేకాదు కొందరు లాగిన్, నెట్వర్క్ ఎర్రర్, యాప్ సంబంధిత ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ‘చాట్ జీపీటీ డౌన్’ అంటూ యూజర్లు ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.
2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సెకన్లలోనే అందుకోవచ్చు. ఎలాంటి క్లిష్ట ప్రశ్నకైన ఇది అలవోకగా సమాధానం చెబుతుండటంతో చాలా మంది దీన్ని వాడేందుకు మక్కువ చూపుతున్నారు.
Also Read..
Digital Fraud | పహల్గాం దాడి పేరుతో వృద్ధురాలిని బెదిరించి.. రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
RCB | సంతోషకరమైన క్షణం.. విషాదంగా మారింది.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ భావోద్వేగం