drugs seized | రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
drugs seized | డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
భోపాల్: డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. (drugs seized) ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి సంయుక్తంగా ఆ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అక్రమంగా మత్తు పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా, గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ఈ విషయాన్ని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ రైడ్‌కు సంబంధించిన ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు. డ్రగ్స్‌పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీ ఎన్సీబీని ఆయన అభినందించారు. మాదకద్రవ్యాలు, వాటి అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో చట్ట సంస్థల అవిశ్రాంత ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. మన సమాజం ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి సహకార ప్రయత్నాలు చాలా కీలకమని కొనియాడారు.
Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!
Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!
This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA
— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

