Odisha MP : ఎంపీపై వరకట్న వేధింపుల కేసు
Case on MP : ఒడిశాకు చెందిన బీజేడీ పార్లమెంట్ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో...

భోపాల్ : ఒడిశాకు చెందిన బీజేడీ పార్లమెంట్ సభ్యుడిపై వరకట్న వేధింపుల కేసు (Case on MP) నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు దాఖలైంది. కేసు నమోదైన విషయాన్ని పీఎస్ ఎస్హెచ్ఓ ధ్రువీకరించారు.
కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మహతాబ్పై రాజధాని నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లఅఓ వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కేసులో ఆయన భార్య మహాశ్వేత, కుమారుడు లోకరంజన్‌పై కూడా కేసు దాఖలైంది. ఎంపీపై వరకట్న వేధింపులతోపాటు రాజద్రోహం, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును భోపాల్ నివాసి, 34 ఏండ్ల భర్తృహరి మహతాబ్ కోడలు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అజిత నాయర్ ప్రకారం, భోపాల్‌లోని ఎంపీ నగర్‌లోని మహాదేవ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త, బీజేడీ ఎంపీ భర్తృహరి మహతాబ్ కుమారుడు లోకరంజన్ మహతాబ్‌తో తన వివాహం 2016 డిసెంబర్ నెలలో జరిగింది.
పెండ్లి సమయంలో తన తండ్రి కట్నకానుకలు చాలా ఇచ్చారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తమామలు మరింత కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె చాలాసార్లు పుట్టింటికి వెళ్లింది. 2018 లో ఆమె న్యూఢిల్లీలోని ఏబీ-94 షాజహాన్ రోడ్‌లోని తన అత్తమామల ఇంటికి చాలాసార్లు వెళ్లింది. కానీ ఆమెను వారు ఇంట్లోకి రానీయలేదు. ఇంటి తలుపులు కూడా తెరవలేదు. దాంతో ఆమె భోపాల్ చేరుకుని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్‌లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్‌తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

