New Year 2025 | కొత్త సంవత్సరానికి (New Year 2025) ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. మరికొద్ది గంటల్లో న్యూఇయర్ వస్తుండటంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్స్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా? హ్యాపీ న్యూఇయర్ అని ఎప్పుడెప్పుడు చెప్పుకుంటామా? అని ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని దేశాల్లో కొత్త ఏడాది ఒకేసారి రాదు. ఒక్కో దేశం ఒక్కో సమయంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇక భారత్‌లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటగానే కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. అయితే, కొన్ని దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం మొదలైపోయింది.
పసిఫిక్ సముద్రంలోని కిరిబాటి దీవి (Kiribati Leads) ప్రజలు అందరికంటే ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే వాళ్లకు న్యూఇయర్ మొదలైపోయింది. కిరిబాటి దీవి తర్వాత న్యూజిలాండ్ (New Zealand) కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భారతీయ కాలమాన ప్రకారం 4.30 గంటలకు వాళ్లకు కొత్త సంవత్సరం మొదలయ్యింది. అద్భుతమైన ఫైర్వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్కమ్ చెప్పారు.
న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది ప్రారంభం అవుతుంది. అక్కడ సాయంత్రం 6:30 గంటలకు న్యూఇయర్ మొదలవుతుంది. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలో రాత్రి 8:30 గంటలకు, చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో రాత్రి 9:30 గంటలకు, థాయ్‌లాండ్, వియత్నాం, కాంబోడియాలో రాత్రి 10:30 గంటలకు న్యూఇయర్ మొదలవుతుంది.
భారత్ తర్వాత 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతోపాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అయితే, చివరిగా మాత్రం అమెరికానే న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతుంది.
Also Read..
Last Sunrise | ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి.. VIDEOS
last day of the year 2024 | కొత్త ఏడాది వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Biren Singh | ఈ ఏడాదంతా దురదృష్టకరమే.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన మణిపూర్ సీఎం