DK Shivakumar : దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి, నీటి ఎద్దడితో సతమతమైన కర్నాటకలోనూ ఇటీవలి భారీ వర్షాలతో పరిస్ధితి చక్కబడింది. భారీ వర్షాలతో తగినంత నీరు వచ్చిచేరిందని నీటి ఎద్దడి నివారణ దిశగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నానని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని తాను రైతాంగాన్ని కోరుతున్నానని, వరద నీరు అధికంగా పోటెత్తితే అప్రమత్తం కావాలని తాను సూచించానని చెప్పారు. ఇక ఈ వారంలో పవిత్రమైన దినాల్లో నదులకు పూజ చేయాలని తాను రైతులను కోరానని తెలిపారు. ఈ విషయంపై తాను సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడానని, గంగా పూజ నిర్వహించే వారణాసికి తాను ఓ బృందాన్ని పంపించానని వెల్లడించారు.
వచ్చే ఏడాది నుంచి అదే తరహా పూజను కర్నాటకలో నిర్వహిస్తామని అన్నారు. కరువులు, వరదలు నివారించి ఏటా మన డ్యామ్లు నీటితో నిండాలని కోరుతూ ఈ తరహా పూజలు క్రమం తప్పకుండా తాము నిర్వహించేందుకు కసరత్తు సాగిస్తున్నామని డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఇటీవలి భారీ వర్షాలకు రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరింది.
Read More :