Loksabha Polls 2024 : రాహుల్ గాంధీని అమేథి నుంచి కాకుండా రాయ్‌బరేలి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ దింపడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలపై ఎస్పీ ఎంపీ, ఆ పార్టీ మొయిన్‌పురి అభ్యర్ది డింపుల్ యాదవ్ స్పందించారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి..ఎక్కడ నామినేషన్ వేయాలనేది ఆ రాజకీయ పార్టీ నిర్ణయమని దాన్ని మనం ప్రశ్నించలేమని స్పష్టం చేశారు.
రాహుల్ రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడంపై కాషాయ పాలకులు భయపడుతున్నారని అనుకుంటున్నానని అందుకే వారు కుటుంబం, కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని డింపుల్ యాదవ్ దుయ్యబట్టారు.
ఇక కేరళలోని వయనాడ్‌లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు రాయ్బరేలిలోనూ రాహుల్ గాంధీకి ఓటమి తప్పదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు.
Read More :
Medchal | దారుణం.. ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించి హింసించిన భార్య