Lok Sabha | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించడం వంటి అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి.
ఆయా అంశాలపై చర్చకు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుబడుతున్నాయి. వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సభలో పెద్ద ఎత్తన ఆందోళనలు చేపడుతున్నారు. వారి ఆందోళనలతో గత నాలుగు రోజులుగా సబా కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ఉభయసభలు ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడుతున్నాయి. దీంతో సభలో నిరసనలకు బ్రేక్ వేసేందుకు లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓంబిర్లా (Om Birla) ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్ష నాయకులను స్పీకర్ కోరినట్లు తెలిసింది. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష ఎంపీలు చెప్పినట్లు సమాచారం. దీంతో సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలూ సజావుగా సాగనున్నాయని సమాచారం.
జూలై 28 నుంచి ఆపరేషన్ సింధూర్‌పై పార్లమెంట్లో చర్చ
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. భారతీయ సైనిక దళాలు .. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న 9 ఉగ్రస్థావరాలను ఆ ఆపరేషన్ సమయంలో నేలమట్టం చేశారు. అయితే పార్లమెంట్లో ఆ అంశంపై చర్చించేందుకు కేంద్రం డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. జూలై 28వ తేదీన దీనిపై చర్చ చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందు కోసం లోక్‌సభ, రాజ్యసభలో 16 గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కేటాయించింది.
Also Read..
PM Modi | ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. మూడేళ్లలో రూ.295 కోట్ల ఖర్చు
OTT platforms | అశ్లీల చిత్రాలు.. 24 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించిన కేంద్రం
Indian Embassy | థాయ్‌లాండ్, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక అడ్వైజరీ