Baba Siddique | ముంబై : మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ బాంద్రాలోని తన కుమారుడు జీషన్ కార్యాలయం వద్ద శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. అయితే సిద్ధిఖీ హత్య వెనుకాల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహిత సంబంధాలు కొనసాగించడం కారణంగానే బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీకి మాత్రం బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు లేవు. కానీ తమకు టార్గెట్‌గా ఉన్న సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ సన్నిహితంగా ఉండడమే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు తమ శత్రువు అని పేర్కొన్నారు. రోహిత్ స్టేట్మెంట్ సిద్దిఖీ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చనే బలాన్ని చేకూరుస్తుంది. తనకు ప్రాణహాని ఉందని, తనకు వై కేటగిరీ భద్రత కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులను 15 రోజుల క్రితం కోరినట్లు సిద్ధిఖీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ప్రజా సేవ చేయడంతో పాటు గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తారనే పేరు సిద్ధిఖీకి ఉంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ పార్టీలోనే సిద్ధిఖీ ఆ ఇద్దరు స్టార్స్‌ను దగ్గరకు చేర్చి గొడవలకు పుల్‌స్టాప్ పెట్టించారు.
ఇవి కూడా చదవండి..
Baba Siddique | బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..!
Vassishta | రామ్ చరణ్, దిల్‌రాజుల కోసం ‘విశ్వంభర’ వాయిదా వేస్తున్నాం : వశిష్ట
Asaduddin Owaisi | ప్రొఫెసర్ సాయిబాబా, ఎన్సీపీ నేత సిద్ధిఖీ మృతిపట్ల అసదుద్దీన్ ఒవైసీ సంతాపం