Vassishta | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి రీలిజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. అయితే డిసెంబర్లో పుష్ప సినిమా ఉండడం.. మరో వైపు క్రిస్మస్ కంటే సంక్రాంతి బెటర్ అని చిత్రబృందం భావించడంతో ఈ చిత్రం క్రిస్మస్ నుంచి సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించింది. అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్నారు. దీనిపై నిర్మాత దిల్ రాజు కూడా వీడియో రూపంలో అధికారిక ప్రకటన ఇచ్చాడు.
అయితే విశ్వంభర సినిమా వాయిదాపై తాజాగా స్పందించాడు దర్శకుడు వశిష్ట. దసరా కానుకగా నిన్న విశ్వంభర టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ వేడుకలో దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. మొన్నటివరకు సంక్రాంతికే వద్దాం అనుకున్నాం. కానీ గేమ్ ఛేంజర్ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు దిల్ రాజు మమ్మల్ని సంప్రదించడం ఈ విషయంపై చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారు. మా సినిమా షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. కానీ రామ్ చరణ్, దిల్‌రాజుల కోసం విశ్వంభర వాయిదా వేస్తున్నాం అంటూ వశిష్ట చెప్పుకోచ్చాడు.
“మా సినిమా already అయిపోయింది. రాజు గారు , చరణ్ గారి కోసం మేము postpone చేసుకుంటున్నాం.”
– Director #Vassishta about Postponing #Vishwambhara#GameChanger #RamCharan pic.twitter.com/5E9RsfLhRC
— Movies4u Official (@Movies4u_Officl) October 12, 2024