Diamonds : ఆ దంపతులు ఇద్దరూ కూలీలు. వాళ్లు గత ఐదేళ్లుగా పన్నా (Panna) లోని నిసార్ గని (Nissar Mine) లో పనిచేస్తున్నారు. కేవలం కూలీ డబ్బులతోనే వారు జీవనం సాగిస్తూ వస్తున్నారు. అయితే ఐదేళ్ల సుదీర్ఘ వెతుకులాట తర్వాత ఇప్పుడు వారి కష్టం ఫలించింది. తాజాగా వారికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 వజ్రాలు (Eight diamonds) దొరికాయి. వాటి విలువ ఏకంగా రూ.12 లక్షలు ఉంటుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
ఛతార్పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్గోవింద్, పవన్ దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు. తాజాగా వారికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువ ఏకంగా రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ.. అసలు విలువను నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. ఆ తర్వాత వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోను మిగిలిన డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు.
డైమండ్స్ దొరకబట్టిన కూలీ హర్గోవింద్ మాట్లాడుతూ.. భగవంతుడు ఇన్నాళ్లకు తమను కనికరించాడని అన్నారు. గతంలోనూ తనకు ఓ వజ్రం దొరికిందని, అయితే అప్పుడు తనకు ఏమీ తెలియక దాన్ని కేవలం లక్ష రూపాయలకే అమ్మానని చెప్పాడు.