Walnuts | న్యూఢిల్లీ: వాల్నట్స్ అత్యంత ఆరోగ్యకరమైనవి. న్యూట్రియెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. అయితే, నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుమేహం ఉన్నవారికి వాల్నట్స్ అంత శ్రేయస్కరం కాదు. వాల్‌నట్స్‌లో ఆక్సలేట్స్ అత్యధికంగా ఉంటాయి.
ఇవి కాల్షియం ఆక్సలేట్ రూపొందడానికి దోహదపడతాయి. మూత్రపిండాల రాళ్లలో సామాన్యంగా కనిపించేది కాల్షియం ఆక్సలేట్. మధుమేహం ఉన్నవారిలో ఎసిడిక్ యూరిన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు వృద్ధి చెందే ముప్పును పెంచుతుంది. మూత్రంలోని కాల్షియం ఆక్సలేట్ పేరుకుపోయి, గడ్డ కట్టడం వల్ల రాళ్లు ఏర్పడతాయి.