Coaching Centre Tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఉవ్వెత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడారు. కోచింగ్ సెంటర్లో జరిగిన దురదృష్టకర ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యతని మంత్రి వివరించారు. కాగా, కోచింగ్ సెంటర్లో విషాద ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించి నీరు సాఫీగా సాగేందుకు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. డ్రైయిన్లకు అడ్డుగా నిర్మించిన బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు.
Read More :
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. 4 గంటలకు గేట్లు ఓపెన్