Vasant Panchami | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. నేడు వసంత పంచమిని (Vasant Panchami) పురస్కరించుకొని రామ మందిరాన్ని (Ram temple) సందర్శన కోసం భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రాకతో అయోధ్యా నగరి రద్దీగా మారింది. అయోధ్య రాముడి దర్శనానికి గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు రామ్ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. మరోవైపు వసంత పంచమి సందర్భంగా బాల రాముడు పసుపు దుస్తుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వసంత పంచమి నాడు అవధ్‌లో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. సాధువులు, భక్తులు ఉత్సాహంగా హోలీ ఆడారు.
#WATCH | Ayodhya, UP: Devotees arrive at Ram Janmabhoomi Temple for the darshan of Ram Lalla on the occasion of Vasant Panchami. pic.twitter.com/DfdVKVBA4T
— ANI (@ANI) February 3, 2025
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సైతం భక్తులు పోటెత్తుతున్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని త్రివేణీ సంగమం (Triveni Sangam)లో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. కుంభమేళాకు వచ్చిన భక్తులు అటు నుంచి అయోధ్యకు వెళ్తుండటంతో అక్కడ భక్తుల రద్దీ నెలకొన్నట్లు రామజన్మభూమి ఆలయ ట్రస్ట్ తెలిపింది.
On the occasion of Basant Panchami, Ram Lalla adorns yellow attire
(Source: Ram Janmabhoomi Trust) pic.twitter.com/KtGEVbMecJ
— IANS (@ians_india) February 3, 2025
Mathura, Uttar Pradesh: In Vrindavan, the Holi celebrations began with Thakur Banke Bihari sprinkling colors on devotees. Temples were filled with vibrant colors, and the 40-day Holi festival commenced with special rituals pic.twitter.com/SukSzm8TXG
— IANS (@ians_india) February 3, 2025
Also Read..
Maha Kumbh Mela | వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు.. పూలవర్షం కురిపించిన అధికారులు
Rishi Sunak | ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య చివరి టీ20.. స్టేడియంలో సందడి చేసిన రిషి సునాక్
Maha Kumbh Mela | భక్తజనసంద్రంగా ప్రయాగ్‌రాజ్.. వసంత పంచమి అమృత స్నానాలు షురూ