కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ’బ్రియన్, ఎన్నికల ఫలితాలకు ముందు కీలక సవాల్ చేశారు. కోల్కతాలో బీజేపీ గెలిచే ప్రతి స్థానానికి ఒక్కో టీఎంసీ ఎంపీ గుండు కొట్టించుకుంటారని అన్నారు. (Derek O’Brien) డెరెక్ ఓ’బ్రియన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. బెంగాల్లో మరోసారి టీఎంసీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మేం ఈ రోజు గొప్పగా మాట్లాడాలనుకోవడం లేదు. మే 4వ తేదీ (లెక్కింపు రోజు) వరకు వేచి ఉంటాం. మేం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉన్నాం. కానీ మీలో కొందరు కోల్కతాకు కూడా వెళ్తున్నారు. కోల్కతాలో 11 స్థానాలు ఉన్నాయి. కోల్కతాలో బీజేపీ ఒక స్థానం గెలిస్తే ఒక ఎంపీ గుండు చేయించుకుంటారు’ అని ఆయన అన్నారు.
కాగా, దక్షిణ 24 పరగణాలలో 31 సీట్లు ఉన్నాయని, అక్కడ కూడా అదే నియమం వర్తిస్తుందని డెరెక్ ఓ’బ్రియన్ తెలిపారు. 2021లో గెలుచుకున్న 215 స్థానాల కంటే ఈసారి ఎక్కువ నియోజకవర్గాలను టీఎంసీ గెలుచుకుంటుందని పార్టీ చైర్పర్సన్ మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారని ఆయన అన్నారు.
మరోవైపు సోమవారం నాటి ఫలితాల్లో బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కోల్కతాలోని 11 స్థానాల్లో ఐదింటిలో, అలాగే దక్షిణ 24 పరగణాలలో కూడా పలు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ’బ్రియన్ ‘గుండు’ సవాల్ ప్రాధాన్యత సంతరించుకున్నది.
Also Read:
Vijay’s manifesto | తమిళనాడులో ‘టీవీకే’ ప్రభంజనం.. విజయ్ ‘మేనిఫెస్టో’ కీలకం
Gaurav Gogoi | జోర్హాట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ.. తొలి ప్రయత్నంలో ఓడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
S A Chandrasekhar | టీవీకేతో చేతులు కలపండి.. కాంగ్రెస్కు విజయ్ తండ్రి సూచన