న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న రాష్ర్టాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్వో) మరణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బీఎల్వోల పని భారాన్ని తగ్గించాలని రాష్ర్టాలను ఆదేశించింది. వారి భద్రత, పని భారం నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పింది.
వారి పని గంటలను తగ్గించేందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. తనను మినహాయించాలని నిర్దిష్ట కారణాన్ని చూపుతూ ఉద్యోగి కోరినపుడు, పరిశీలించాలని చెప్పింది.