Dell Layoffs : ఐటీ, టెక్నాలజీ రంగంలో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ గత 15 నెలల్లో రెండవ దశ లేఆఫ్స్‌ను ప్రకటించాయి. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని విధుల నుంచి తొలగించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేశాయి.
కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణ, భవిష్యత్ వృద్ధికి దారితీసే రంగాల్లో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఉద్యోగుల సంఖ్యను డెల్ కుదించిందని చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని డెల్ గ్లోబల్ సేల్స్, కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ చానెల్స్ చీఫ్ జాన్ బైర్న్ ఓ మెమో ద్వారా సమాచారం అందించారు. భవిష్యత్ వృద్ధి కోసం ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు.
లేఆఫ్స్ గురించి హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్స్‌తో పాటు ముఖాముఖి భేటీల ద్వారా ఉద్యోగులకు తెలియచేశారు. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనం, ఉద్యోగి పనిచేసిన ఏడాదికి ఒక వారం చొప్పున గరిష్టంగా 26 వారాల వరకూ వేతనాన్ని లెక్కగట్టి పరిహార ప్యాకేజ్ కింద చెల్లించనున్నారు. ఇక ఇటీవల ఉద్యోగుల బడ్జెట్ కుదించడం, ప్రాజెక్టులు రద్దు కావడంతో తదుపరి లేఆఫ్స్‌ను పలువురు ఉద్యోగులు అంచనా వేశారు.
Read More :
Serena Williams: పారిస్ రెస్టారెంట్లో సెరీనా విలియమ్స్‌కు చేదు అనుభవం