న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చేపట్టనున్న ఐదు కొత్త బిల్లులతో సహా ఏడు బిల్లుల తాత్కాలిక జాబితాను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కొత్త నియోజకవర్గాల పునర్విభజన విధానం కోసం రాజ్యాంగ సవరణ, రాజకీయ కార్యనిర్వాహక వర్గాల వారు(మంత్రులు వంటి వారు) సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నట్లయితే వారిని పదవుల నుండి తొలగించడం వంటి వివాదాస్పద బిల్లులు ఇందులో లేవు.
అదే సమంయలో గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా పక్కన పెట్టిన విదేశీ విరాళాల వివాదాస్పద బిల్లును, రాష్ర్టాల అధికారాల్లో జోక్యం చేసుకున్నందుకు గాను టీడీపీ వంటి ఎన్డీయే మిత్రపక్షాల ఆగ్రహానికి గురైన విద్యా రంగానికి సంబంధించిన మరో బిల్లును ముందుకు తీసుకురావాలని తన ఆలోచనను ప్రభుత్వం సూచించింది.