Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. గత పది రోజులుగా రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. సోమవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచి అధ్వానంగా నమోదైంది. అదేవిధంగా నగరాన్ని పొగమంచు దట్టంగా ఆవహించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 349గా నమోదైంది.
#WATCH | A thick layer of smog engulfs the area around India Gate and Vijay Chowk as the Air Quality Index (AQI) across Delhi continues to be in ‘Very Poor’ category in several areas as per the Central Pollution Control Board (CPCB).
AQI in JLN is at 316 pic.twitter.com/4phQXGkPGD
— ANI (@ANI) November 11, 2024
రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400కి (తీవ్రమైన స్థాయి) పైనే నమోదైంది. బవానాలో ఏక్యూఐ 401, జహంగీర్‌పురిలో 412, ఆనంద్ విహార్‌లో 378, అశోక్ విహార్‌లో 379, ద్వారకా సెక్టార్ 8లో 356, ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో 336, ముంద్కా ప్రాంతంలో 379, ద్వారకాలో 379, పంజాబీ బాగ్‌లో 385, ఆర్కే పురంలో 368, రోహిణిలో 383, వజీర్‌పూర్‌లో 391గా ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి నాణ్యత సూచీ 140తో మోడరేట్ కేటగిరీలో నమోదైంది. ముంబై మహానగరాన్ని సైతం పొగ మంచు కమ్మేసింది.
#WATCH | Mumbai, Maharashtra: A thick layer of smog looms over the city as air quality continues to deteriorate
(Visuals from near the Eastern Freeway Bridge) pic.twitter.com/sULvNK0TwL
— ANI (@ANI) November 11, 2024
కాగా, సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీంతో ఢిల్లీ నగరాన్ని తేలికపాటి పొగమంచు కమ్మేసింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్ ప్రభుత్వం ఆదివారం ‘EV as a Service’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలుగా ప్రోత్సహిస్తోంది.
Also Read..
Siddaramaiah | ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సవాల్
Onion Price | మరింత ఘాటెక్కిన ఉల్లి.. కిలో ఎంతంటే..?