లక్నో, జూలై 28: అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి తనదని రాణి పంజాబీ అనే మహిళ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. ఆ భూమి తన కుటుంబానికి చెందినదని, పత్రాలన్నీ తన వద్ద ఉన్నాయని రాణి అన్నారు. ఆమె వాదనను మసీద్ ట్రస్ట్ హెడ్ ఫారూకీ ఖండించారు. భూమిపై ఆమె హక్కుల్ని 2021లో అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిన సంగతిని ఆయన గుర్తుచేశారు.