coaching centres | వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ (Raus IAS Study Circle) బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ల నిర్వహణ తీరు, విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ మంత్రి అతిషీ (Atishi ) స్పష్టం చేశారు.
ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ షెల్లీ ఓబెరియ్తో కలిసి మంత్రి బుధవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో బేస్మెంట్లలో నిర్వహిస్తున్న 30 సివిల్స్ కోచింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. సుమారు 200 ఇన్స్టిట్యూట్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ కోసం అధికారులు, విద్యార్థులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. డ్రైనేజ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందువల్ల వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సైతం.. తన ప్రాథమిక నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని మంత్రి అతిషీ వివరించారు.
Also Read..
Veena George | కారు ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.. వయనాడ్ వెళ్తుండగా ఘటన
Anant Ambani | పారిస్ ఒలింపిక్స్లో సందడి చేసిన కొత్త జంట అనంత్ అంబానీ – రాధికా మర్చంట్