Atishi | ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ (Atishi) ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎంగా ఎన్నికైన తర్వాత అతిశీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ముందుగా తనకు సీఎంగా అవకాశం కల్పించినందుకు కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసిన కేజ్రీవాల్‌కు ప్రత్యకంగా కృతజ్ఞతలు. నేను వేరే పార్టీలో ఉండి ఉంటే.. బహుశా నాకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా దక్కేది కాదు. కానీ కేజ్రీవాల్ నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేను, మంత్రిని చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు. ఇలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంతటి అవకాశం కల్పించిన కేజ్రీవాల్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను’ అని అతిశీ పేర్కొన్నారు.
ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారని.. అది అరవింద్ కేజ్రీవాలే అని అతిశీ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ అధినేతను తిరిగి ఎన్నుకోవడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా అతిశీ స్పష్టం చేశారు. ‘ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు.. అది అరవింద్ కేజ్రీవాలే. ఆయన్ని తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడమే మా లక్ష్యం. ఢిల్లీ ప్రజలు, ఆప్ ఎమ్మెల్యేలు, నేను ఆ లక్ష్యంతో పని చేస్తాం’ అని అతిశీ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీపై అతిశీ నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి ఆరు నెలల పాటు కటకటాల పాలు చేశారని మండిపడ్డారు.
Also Read..
JIO Down | జియో సేవల్లో అంతరాయం.. నెట్వర్క్ రావట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు
Atishi | ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీ.. ప్రకటించిన ఆప్
PM Modi: ప్రధాని మోదీ 74వ పుట్టిన రోజు.. విషెస్ తెలిపిన బీజేపీ నేతలు