న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. సోమవారం దేశంలో మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 170కి పెరిగింది. ఇందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 54 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 28, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 17, గుజరాత్లో 11, ఉత్తరప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, చండీగఢ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
ఇవాళ నమోదైన 12 కొత్త కేసుల్లో ఢిల్లీలో ఆరు, కేరళలో నాలుగు, కర్ణాటకలో ఐదు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 28 మంది ఒమిక్రాన్ బారినపడ్డారని, ఇందులో 12 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ తెలిపింది. కర్ణాటకలో ఐదు కేసులు నమోదవగా.. బాధితులు ధార్వాడ్, భద్రావతి, ఉడిపి, మంగళూరుకు చెందిన వారని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు.