Heat Wave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మరోవైపు వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) అప్రమత్తమైంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు కీలక మార్గదర్శకాలను విడుదల (issued an advisory to schools) చేసింది. ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మధ్యాహ్నం షిఫ్ట్ సమయంలో విద్యార్థుల సమావేశాలు లేకుండా చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేయాలని, తరగతుల సమయంలో విద్యార్థులకు నీటి విరామం ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థులు ఎండపడకుండా ఉండేందుకు తలను కప్పుకునేలా అవగాహ కల్పించాలని సూచించింది.
‘వేసవి కాలంలో ఢిల్లీలో పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ఆరోగ్యానికి ఇది హానికరం. హీట్‌వేవ్స్ వల్ల పిల్లలు వేడి సంబంధిత అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ / ప్రభుత్వ సహాయం పొందిన / ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీటిని ఏర్పాటు చేయాలి. తరగతుల సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా నీటి విరామం ఇవ్వాలి. మధ్యాహ్నం షిఫ్ట్ సమయంలో విద్యార్థులకు సమావేశాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పాఠశాలకు వస్తున్నప్పుడు లేదా బయటకు వెళ్లే సమయంలో విద్యార్థులు ఎండ పడకుండా తమ తలలను గొడుగు, టోపీ, టవల్, క్లాత్ వంటి వాటితో కప్పుకునేలా అవగాహన కల్పించాలి’ అని సర్క్యులర్‌లో పేర్కొంది.
Also Read..
Viral Video | ప్లేటుకు 10 పూరీలు.. కేవలం రూ.30 మాత్రమే
Amritpal Singh | పంజాబ్‌లో అమృత్‌పాల్ పోస్టర్లు.. అతని గురించి సమాచారం అందిస్తే రివార్డు
Rahul Gandhi | రాహుల్‌ను చుట్టుముడుతున్న వరుస వివాదాలు.. మరో పరువు నష్టం కేసు నమోదు