Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
సీబీఐ, ఈడీతో పాటు సిసోడియా తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరో వైపు మద్యం పాలసీ కేసులో ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఆయన ప్రస్తుతం తిహార్ జైలులోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఆయనను కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌తో తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. అరెస్టును సవాల్ చేసిన పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది.