water crisis : నీటి ఎద్దడితో ఓవైపు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఆరోపించారు.
ఢిల్లీ అంతటా మురికి నీరు సరఫరా అవుతోందని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గతంలోనే నీటి సమస్యకు పరిష్కారం అన్వేషిస్తే ఈరోజు న్యాయస్ధానాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి నీటిని విడుదల చేసిందని చెప్పారు. వాటర్ లీకేజ్ కూడా ఢిల్లీలో అధికంగా ఉందని, ఈ సమస్యకు కేజ్రీవాల్ ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. నీటి సంక్షోభంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :