సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీతో కలిసి టీ హబ్(T- Hub) మొబిలిటీ చాలెంజ్‌ను నిర్వహిస్తోంది. ఆటో మొబైల్ రంగంలో ఉన్న స్టార్టప్‌లను(Auto mobile startups) ప్రోత్సహించడంతో పాటు ఎంపిక చేసిన స్టార్టప్‌లకు మార్కెట్లపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాపార, వాణిజ్య ప్రణాళికలను మెరుగుపర్చి మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్దం చేసేలా ఇంక్యుబేటర్‌లో సహయ సహకారాలను అందిస్తారు. ప్రధానంగా అత్యాధునిక టెక్నాలజీలైన వీడియో ఎనలిటిక్స్, ఏఐ,ఎంఎల్, డేటాఎనలిటిక్స్లో స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకు ( https://bit.ly/3xjuO8B) దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.