న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) అధికారిక బంగ్లా పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. పరిపాలనా కారణాల వల్ల సీఎం అధికార బంగ్లా పునరుద్ధరణ టెండర్‌ను పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) రద్దు చేసింది. రూ.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ టెండర్‌ను జూలై 7న రద్దు చేసినట్లు పీడబ్ల్యూడీ పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటంతో సీఎంగా రేఖా గుప్తా ఫిబ్రవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నంబర్ 1ను జూన్‌లో ఆమెకు కేటాయించారు.
కాగా, ఈ బంగ్లాలో పునరుద్ధరణ పనుల కోసం జూలై 1న టెండర్ నోటీస్ జారీ చేశారు. తొలిదశ పనుల్లో భాగంగా 80 లైట్, ఫ్యాన్ పాయింట్ల పూర్తి రీవైరింగ్, రూ.11 లక్షలకు పైగా ఖరీదైన రెండు టన్నుల 24 ఎయిర్ కండీషనర్లు ఏర్పాటు, 23 ప్రీమియం సీలింగ్ ఫ్యాన్లు, 16 వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ఏర్పాటు, రూ.6.03 లక్షల విలువైన లైటింగ్ ఓవర్‌హాల్ పనులు కూడా ఇందులో ఉన్నాయి. 16 నికెల్-ఫినిష్ ఫ్లష్ సీలింగ్ లైట్లు, ఏడు ఇత్తడి సీలింగ్ లాంతర్లు, ఎనిమిది ఇత్తడి, గాజు గోడ మౌంటెడ్ లైట్లు, ఐదు టీవీలు కొనుగోలు చేయాలని కూడా పీడబ్యూడీ ప్రతిపాదించింది.
మరోవైపు సీఎం రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘మాయ మహల్, రంగ్ మహల్’ పునరుద్ధరణ కోసం రూ.60 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆప్, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో ఈ టెండర్‌ను పీడబ్యూడీ రద్దు చేసినట్లు తెలుస్తున్నది.
Also Read:
Arvind Kejriwal | నా పాలనకుగాను.. నాకు నోబెల్ బహుమతి రావాలి: అరవింద్ కేజ్రీవాల్
China’s Mega Dam | చైనా మెగా డ్యామ్ నిర్మిస్తోంది.. వాటర్ బాంబ్ పేలనున్నది: అరుణాచల్ సీఎం
Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్