ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో మెగా డ్యామ్‌ను చైనా నిర్మిస్తున్నదని (China’s Mega Dam) ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ తెలిపారు. ఆ వాటర్ బాంబ్ పేలనున్నదని అన్నారు. సైనిక ముప్పు కంటే ఇది పెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఈ సంచలన విషయాన్ని పెమా ఖండు బయటపెట్టారు. యార్లుంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్ట్‌ను చైనా నిర్మిస్తున్నదని తెలిపారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేయకపోవడమే దీనికి కారణమని అన్నారు.
కాగా, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్‌ను అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా కట్టాల్సి ఉందని సీఎం పెమా ఖండూ తెలిపారు. అయితే చైనాను నమ్మలేమని, అది ఏం చేస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. చైనా నుంచి ఎదురయ్యే సైనిక ముప్పు కంటే చాలా పెద్ద సమస్యగా తనకు అనిపిస్తున్నదని అన్నారు.
మరోవైపు 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో 60,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్టను చైనా కట్టడం వల్ల అరుణాచల్‌లోని తెగలకు, అస్తిత్వానికి, జీవనోపాధికి ముప్పు కలుగుతుందని పెమా ఖండూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది చాలా తీవ్రమైనది. ఎందుకంటే చైనా దీనిని ఒక రకమైన ‘వాటర్ బాంబు’గా కూడా ఉపయోగించుకోవచ్చు’ అని అన్నారు. ఒకవేళ అంతర్జాతీయ నిబంధనలను చైనా పాటిస్తే ఈ డ్యామ్ వల్ల భారత్‌కు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అయితే చైనాను ఎవరూ నమ్మలేరని అన్నారు.
VIDEO | EXCLUSIVE: China’s mega dam being built near the Arunachal Pradesh border will be a ticking “water bomb,” an existential threat more dangerous than its military, the state’s chief minister Pema Khandu (@PemaKhanduBJP) has said.
Speaking to PTI Editor-in-Chief Vijay… pic.twitter.com/0LhctGNnIN
— Press Trust of India (@PTI_News) July 9, 2025
Also Read:
Arvind Kejriwal | నా పాలనకుగాను.. నాకు నోబెల్ బహుమతి రావాలి: అరవింద్ కేజ్రీవాల్
Woman Forced To Marry Husband’s Nephew | భర్త మేనల్లుడితో.. మహిళకు బలవంతంగా వివాహం
Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్