Rekha Gupta | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా (Rekha Gupta) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar)ను కలిశారు.
Chief Minister of Delhi, Rekha Gupta called on President Droupadi Murmu at Rashtrapati Bhavan.
(Source – Rashtrapati Bhavan/X) pic.twitter.com/UYmkuPMM5x
— ANI (@ANI) February 21, 2025
ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా.. అక్కడ ద్రౌపదీ ముర్మును (President Droupadi Murmu) మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరితోనూ సీఎం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు ఎక్స్ వేదికగా పోస్టు చేశాయి.
Rekha Gupta, Chief Minister of Delhi, called on the Vice-President, Jagdeep Dhankhar, at the Vice-President’s Enclave today.
(Source – Vice-President/X) pic.twitter.com/ux2a6SDuU0
— ANI (@ANI) February 21, 2025
కాగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మన్జీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, రవిందర్ ఇంద్రాజ్ సింగ్, పంకజ్ సింగ్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం మొదటి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు. కాగా, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. ఆర్థిక, రెవెన్యూ శాఖలను సీఎం రేఖా గుప్తా తన వద్ద ఉంచుకున్నారు.
Also Read..
Rekha Gupta | ఒక్కరోజు కాలేదు.. అప్పుడే విమర్శలా..? ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్
Dharmendra Pradhan | ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టీకరణ
Rahul Gandhi | ఇది వైఫల్యం చెందిన ప్రభుత్వం.. కేంద్రంపై రాహుల్‌గాంధీ ఫైర్